మెగా ప్రశంస
ABN , First Publish Date - 2021-12-28T05:55:54+05:30 IST
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ఫ’ విజయం సాధించినందుకు మెగాస్టార్ చిరంజీవి చిత్ర దర్శకుడు సుకుమార్‌ను అభినందించారు...

అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ఫ’ విజయం సాధించినందుకు మెగాస్టార్ చిరంజీవి చిత్ర దర్శకుడు సుకుమార్‌ను అభినందించారు. ఈ చిత్రాన్ని చిరంజీవి ఇటీవల చూశారు. వెంటనే దర్శకుడు సుకుమార్‌ను తన ఇంటికి ఆహ్వానించి, అభినందించారు. సినిమా తనకెంతో నచ్చిందనీ, అన్ని భాషల్లో ‘పుష్ప’ చిత్రానికి ఆదరణ లభిస్తున్నందుకు ఆనందంగా ఉందనీ ఆయన అన్నారు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా ఉందనీ, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా ఉందనీ, దర్శకుడిగా సుకుమార్ పడిన కష్టం, తపన ప్రతి ఫ్రేమ్‌లో కనిపించాయని చిరంజీవి ప్రశంసించారు.