`గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ పూర్తి చేసిన మీనా!

ABN , First Publish Date - 2021-01-18T18:00:19+05:30 IST

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రముఖ కథానాయిక మీనా పూర్తి చేసింది.

`గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ పూర్తి చేసిన మీనా!

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రముఖ కథానాయిక మీనా పూర్తి చేసింది. చెన్నైలోని సైదాపేట్‌లో ఉన్న తన నివాసంలో తాజాగా మొక్కలు నాటింది. యాంకర్, బిగ్‌బాస్ ఫేం దేవి నాగవల్లి నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన మీనా తాజాగా దానిని పూర్తి చేసింది.


ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. `పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారికి అభినందనలు. ఈ ఛాలెంజ్ ఇలాగే ముందుకు కొనసాగాలి. ఈ ఛాలెంజ్‌కు హీరోలు వెంకటేష్, సుదీప్, హీరోయిన్లు మంజు వారియర్, కీర్తి సురేష్‌లను నామినేట్ చేస్తున్నాన`ని మీనా పేర్కొంది.

Updated Date - 2021-01-18T18:00:19+05:30 IST