మరో మాస్ సాంగ్ షూట్‌లో ‘ఖిలాడి’ టీమ్

ABN , First Publish Date - 2021-12-30T18:13:00+05:30 IST

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఖిలాడి’. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘క్రాక్’ మూవీతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ తో బోణీ కొట్టిన రవితేజ.. వచ్చే ఏడాది కూడా మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోడానికి రెడీ అవుతున్నారు. దానికి తగ్గట్టే ఈ సినిమాను మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరో మాస్ సాంగ్ షూట్‌లో ‘ఖిలాడి’ టీమ్

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఖిలాడి’. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘క్రాక్’ మూవీతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ తో బోణీ కొట్టిన రవితేజ.. వచ్చే ఏడాది కూడా మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోడానికి రెడీ అవుతున్నారు. దానికి తగ్గట్టే ఈ సినిమాను మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది వరకు విడుదలైన ‘ఖిలాడి’ టీజర్ .. ప్రామిసింగ్ గా అనిపించింది. ఇప్పటికే రెండు సింగిల్స్ విడుదలై.. మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా. మూడో లిరికల్ సాంగ్  రేపు (శుక్రవారం ) విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నాలుగో సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నారు ఖిలాడీ చిత్ర బృందం. 


అదిరిపోయే మాస్ బీట్ తో ఈ పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతి, రమేశ్ వర్మ, శేఖర్ మాస్టర్  తదితరులు దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతంలో దుమ్మురేపబోతోంది ఈ పాట. యాక్షన్ హీరో అర్జున్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజకు ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.  



Updated Date - 2021-12-30T18:13:00+05:30 IST