ఆకట్టుకుంటున్న ‘మరణం’ ట్రైలర్‌

ABN , First Publish Date - 2021-04-26T23:48:23+05:30 IST

తెలుగులో హారర్ చిత్రాలకి క్రేజ్‌ ఎలా ఉంటుందో తెలియంది కాదు. సరికొత్త కథ కథనంతో అద్భుతమైన విజువల్స్‌తో ఒక హారర్ చిత్రం వస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.. ఇప్పటికే అనేక సినిమా విషయంలో

ఆకట్టుకుంటున్న ‘మరణం’ ట్రైలర్‌

తెలుగులో హారర్ చిత్రాలకి క్రేజ్‌ ఎలా ఉంటుందో తెలియంది కాదు. సరికొత్త కథ కథనంతో అద్భుతమైన విజువల్స్‌తో ఒక హారర్ చిత్రం వస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.. ఇప్పటికే అనేక సినిమా విషయంలో నిరూపితమైంది. ఇప్పుడలాంటి కోవకే చెందిన కథాంశంతో వస్తున్నామని అంటున్నారు 'మరణం' చిత్ర టీమ్‌. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా.. సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. శ్రీమతి బి. రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మరణం'.  వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కర్మ పేస్ అనేది ఉప శీర్షిక. వీర్ సాగర్ ఈ చిత్రంలో డెమోనోలజిస్ట్ అంటే ఆత్మలను బంధించే శాస్త్రవేత్తగా నటించారు. శ్రీ రాపాక కూడా నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకోవడంతో.. చిత్రయూనిట్‌ సంతోషం వ్యక్తం చేస్తూ.. ట్రైలర్‌ను పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.



Updated Date - 2021-04-26T23:48:23+05:30 IST