‘మా’ ఎన్నికల బరిలోకి మంచు విష్ణు!
ABN, First Publish Date - 2021-06-21T13:46:07+05:30
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి మంచు విష్ణు పోటీ చేయబోతున్నట్లు సమాచారం..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగుతున్నట్లు తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్. కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీకి మంచి సంబంధాలు నెలకొన్నాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడిన తర్వాతే విష్ణు ప్రకటన చేస్తారని సమాచారం.