సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

యూట్యూబ్‌ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక!

ABN, First Publish Date - 2021-10-25T02:21:10+05:30

హీరోయిన్లపై అసభ్యకరమైన వీడియోలు, థంబ్‌నైల్స్‌ పెడితే క్షమించేది లేదని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటీనటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్లపై అసభ్యకరమైన వీడియోలు, థంబ్‌నైల్స్‌ పెడితే క్షమించేది లేదని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటీనటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నారు. అలా వ్యవహరించే అలాంటి ఛానళ్లపై చర్యలు తీసుకుంటాం. వాటిలో థంబ్‌నైల్స్‌ హద్దులు దాటుతున్నాయి.  నటీమణులు మన ఆడపడుచులు. వారిని గౌరవించాలి’’ అని విష్ణు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్లపై అసభ్యకర వీడియోలు పోస్ట్‌ చేస్తే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. హద్దులు మీరే ఇలాంటి యూట్యూబ్‌ ఛానళ్లును నియంత్రిండం తన ఎజెండాలో ఓ అంశమని విష్ణు పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-25T02:21:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!