Manchu Vishnu: పవన్‌, నేను చాలా చర్చించుకున్నాం

ABN , First Publish Date - 2021-10-18T20:42:58+05:30 IST

సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో గెలిస్తే.. స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో మంచు విష్ణుని పవన్‌కల్యాణ్‌ ఏమాత్రం పట్టించుకోలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు తెలిపారు. ‘‘చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ‘అలయ్‌ బలాయ్‌’ కార్యక్రమంలో స్టేజ్‌ పైకి రాకముందే పవన్‌క్యలాణ్‌తో మాట్లాడాను.

Manchu Vishnu: పవన్‌, నేను చాలా చర్చించుకున్నాం

సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో గెలిస్తే.. స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో మంచు విష్ణుని పవన్‌కల్యాణ్‌ ఏమాత్రం పట్టించుకోలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు తెలిపారు. ‘‘చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ‘అలయ్‌ బలాయ్‌’ కార్యక్రమంలో స్టేజ్‌ పైకి రాకముందే పవన్‌క్యలాణ్‌తో మాట్లాడాను. మేమిద్దరం చాలా విషయాలపై చర్చించుకున్నాం. ప్రోటోకాల్‌ ప్రకారం మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడుకోలేదు. స్టేజ్ మీద ఏం జరిగిందో అది మాత్రమే జనాలకు తెలుసు. అంతకుముందు ఏం జరిగిందనే ఎవరకీ తెలీదు. పవన్‌కల్యాణ్‌కి ఫ్యాన్స్‌ సంఖ్య ఎక్కువ... వాళ్లని సర్‌ప్రైజ్‌ చేయడానికి నేను ట్విటర్‌లో ఆ వీడియో షేర్‌ చేశాను. నాన్నగారితో చిరంజీవి ఫోన్‌లో మాట్లాడారు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాన్నని అడిగితే బావుంటుంది’’ అని విష్ణు అన్నారు. 


రాజీనామాలు ఆమోదించడం లేదు..

ప్రకాశ్‌రాజ్‌, నాగబాబుగారు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాటిని ఆమోదించడం లేదు. త్వరలో వారికి లేఖ పంపిస్తాను. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో గెలిచిన సభ్యులు రాజీనామా చేసినట్లు మీడియా ద్వారా నాకు తెలిసింది. ఒక్కరి నుంచి మాత్రమే నాకు రాజీనామా అందింది. మిగిలిన వాళ్ల నుంచి కూడా వచ్చాక.. మేమంతా ఓ సారి చర్చించుకుని పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. 


Updated Date - 2021-10-18T20:42:58+05:30 IST