మంచు మనోజ్‌కి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-12-29T19:59:55+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఆల్రెడీ రెండు సార్లు దీని ధాటికి కుదేలయ్యారు. ఎంతో జాగ్రత్తగా ఉండే సినీతారలు కూడా దీని బారి నుంచి తప్పించు కోలేకపోయారు. ఇప్పుడు మరోసారి ఆ విషయం రుజువైంది. టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ తనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు.

గత కొద్దిరోజులుగా తనతో క్లోజ్‌గా ఉన్న వారు టెస్టులు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తన గురించి ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, ప్రస్తుతం తను బాగానే ఉన్నానని మంచు మనోజ్ తెలిపారు. ఈ సందర్బంగా తన ట్రీట్ మెంట్ అందిస్తున్న డాక్టర్స్, నర్సెస్ కు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. మంచు మనోజ్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.