సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దీపావళి కానుకగా మారుతి ‘మంచిరోజులు వచ్చాయి’

ABN, First Publish Date - 2021-10-04T15:29:21+05:30

దర్శకుడు మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ మూవీ రూపొందిస్తుండగా.. అదే సమయంలో మరో చిన్న సినిమాకీ దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా ‘మంచిరోజులు వచ్చాయి’. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై వి సెల్యులాయిడ్, యస్కేయన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శకుడు మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ మూవీ రూపొందిస్తుండగా.. అదే సమయంలో మరో చిన్న సినిమాకీ దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా ‘మంచిరోజులు వచ్చాయి’. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై వి సెల్యులాయిడ్, యస్కేయన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘టాక్సీవాలా, ఏక్ మినీ కథ’ చిత్రాల తర్వాత యస్ కే యన్ నిర్మిస్తున్న మరో సినిమా ఇది.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘మంచిరోజులు వచ్చాయి’ మూవీని దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్. మెహ్రిన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 



Updated Date - 2021-10-04T15:29:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!