Maruthi: థియేటర్‌లకు ‘మంచి రోజులు’

ABN , First Publish Date - 2021-07-26T00:35:19+05:30 IST

సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్ప్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి సెల్యూలాయిడ్‌ ఎస్‌కెఎన్‌ నిర్మాతలు.

Maruthi: థియేటర్‌లకు ‘మంచి రోజులు’

సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్ప్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి సెల్యూలాయిడ్‌ ఎస్‌కెఎన్‌ నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం క్యారెక్టర్స్‌ లుక్స్‌ను విడుదల చేశారు. ‘‘కరోనా విపత్కర పరిస్థితులు చూశాక నా వంతు కృషిగా ఏదైనా చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కథ ఇది. థియేటర్స్‌లో విడుదల చేయాలని మెరుపు వేగంతో టీమంతా వర్క్‌ చేశాం. సినిమాను థియేటర్‌లోనే విడుదల చేస్తాం. త్వరలో తేదీని ప్రకటిస్తాం’’ అని మారుతి అన్నారు. ఈ సినిమా చేయడంతో తనకు మంచి రోజులొచ్చాయని మెహరీన్‌ తెలిపారు. ‘‘అల్లు అరవింద్‌గారి ఆశీసులతో బన్నీ వాసు, విక్రమ్‌, వంశీ, మారుతిలాంటి మంచి స్నేహితులు ఉండబట్టే నేను నిర్మాతనయ్యా. మంచి కథ చెప్పే చిత్రమిది’’ అని ఎస్‌కెఎన్‌ తెలిపారు. 





Updated Date - 2021-07-26T00:35:19+05:30 IST