'మంచి రోజులు వచ్చాయి': ఆకట్టుకుంటున్న 'సో.. సోగా' సాంగ్
ABN , First Publish Date - 2021-09-22T13:18:01+05:30 IST
'మంచి రోజులు వచ్చాయి' చిత్రం నుంచి తాజాగా విడుదలైన 'సో.. సోగా' అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు.
'మంచి రోజులు వచ్చాయి' చిత్రం నుంచి తాజాగా విడుదలైన 'సో.. సోగా' అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో తెరకకెక్కుతున్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా ‘సో సోగా ఉన్నాననీ.. సో స్పెషలే చేశావులే’ అంటూ సాంగే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారి. మెగా మేనల్లు సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ క్లాసిక్ మెలోడీ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.
కేకే సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ పాడగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో 50 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ సినిమాలో శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, సుదర్శన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.