సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pushpa the rise : ఆకట్టుకుంటోన్న మేకింగ్ వీడియో

ABN, First Publish Date - 2021-12-05T19:14:04+05:30

అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ఇది వరకు విడుదలైన టీజర్, సింగిల్స్.. సినిమాపై భారీ అంచనాల్ని నెలకొల్పాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ఇది వరకు విడుదలైన టీజర్, సింగిల్స్.. సినిమాపై భారీ అంచనాల్ని నెలకొల్పాయి. కాగా  రేపు (సోమవారం) ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. దానికి ముందు ‘పుష్ప’ టీమ్ ఓ చిన్న మేకింగ్ వీడియోను విడుదల చేశారు. 


మనం ఈ లొకేషన్ ను ఖాళీ చేసి వెళ్ళేలోపు.. ఇక్కడున్న ప్లాస్టిక్ సామాను, చెత్త చెదారం అంతా క్లీన్ చేసి నీట్ గా ఉంచాలని మేకింగ్ వీడియోలో బన్నీ ‘పుష్ప’ టీమ్ కు సూచించడం కనిపిస్తుంది. అలాగే.. ఈ సినిమాను షూట్ చేసిన వివిధ లొకేషన్స్ లో టీమ్ పడిన కష్టాన్ని వీడియోలో కళ్ళకు కట్టారు. సెల్ ఫోన్ తో చిత్రీకరించిన ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



Updated Date - 2021-12-05T19:14:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!