జూలైలో సెట్స్‌కు ‘మేజర్’
ABN, First Publish Date - 2021-06-20T05:59:23+05:30
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’. కరోనా రెండో దశ ఉధృతి తగ్గి, సాధారణ పరిస్థితులు వస్తుండటంతో చిత్రీకరణకు హీరో సహా మిగతా బృందం...
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’. కరోనా రెండో దశ ఉధృతి తగ్గి, సాధారణ పరిస్థితులు వస్తుండటంతో చిత్రీకరణకు హీరో సహా మిగతా బృందం సిద్ధమవుతోంది. జూలైలో మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనున్నారు. ‘‘జూలైలో చిత్రీకరణ ప్రారంభించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అని అడివి శేష్ పేర్కొన్నారు. ముంబై-2008 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కథానాయికగా సయీ మంజ్రేకర్, ప్రధాన పాత్రల్లో శోభితా ధూళిపాల, ప్రకాశ్‌రాజ్, రేవతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు.