Major: మేకింగ్ వీడియోతో రిలీజ్ డేట్ అనౌన్స్..
ABN, First Publish Date - 2021-11-03T16:29:51+05:30
అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మేజర్'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న
అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మేజర్'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను, న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 2022, ఫిబ్రవరి 11 న 'మేజర్' సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాని సోని పిక్చర్స్ ఫిల్మ్స్ మీడియా, GMB ఎంటర్ టైన్మెంట్, A+S మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి.