సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఛలో స్పెయిన్ అంటోన్న నమ్రత, సితార

ABN, First Publish Date - 2021-10-03T20:38:43+05:30

సందర్భమొచ్చినప్పుడల్లా .. సూపర్ స్టార్ మహేశ్ కి కుటుంబసమేతంగా విదేశాలకు పయనమవ్వడం పరిపాటి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేయడాన్ని మాత్రం ఆయన లైట్ తీసుకోరు. తాజాగా మహేశ్ బాబు అండ్ ఫ్యామిలీ మరోసారి విదేశీ ట్రిప్ వేయడం విశేషం. ఈ సారి వారంతా ఛలో స్పెయిన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సందర్భమొచ్చినప్పుడల్లా.. సూపర్ స్టార్ మహేశ్ కి కుటుంబసమేతంగా విదేశాలకు పయనమవ్వడం పరిపాటి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేయడాన్ని మాత్రం ఆయన లైట్ తీసుకోరు. తాజాగా మహేశ్ బాబు అండ్ ఫ్యామిలీ మరోసారి విదేశీ ట్రిప్ వేయడం విశేషం. ఈ సారి వారంతా ఛలో స్పెయిన్ అన్నారు.  తాజాగా నమ్రతా శిరోద్కర్ .. తాము స్పెయిన్ వెళుతున్నట్టు తన ఇన్ స్టా ఖాతా ద్వారా తెలియచేశారు. అంతేకాదు.. తాను, సితారా దిగిన ఓ ఫోటో కూడా షేర్ చేశారు. 

గారాల తనయ సితార, తను దిగిన ఫోటోను నమ్రతా షేర్ చేస్తూ.. ‘మరో మరిచిపోలేని హాలీడే స్పెయిన్ . హియర్ వి కమ్’ అంటూ.. కేప్షన్ కూడా ఇచ్చారు. స్పెయిన్ లో పదిరోజుల పాటు హాలీ డే ను ఎంజార్ చేయబోతున్నారు. ‘సర్కారు వారి పాట’ టీమ్ తదుపరి షెడ్యూల్ ను స్పెయిన్ లో ప్లాన్ చేశారట. అందుకే మహేశ్ తన కుటుంబంతో సహా స్పెయిన్ లో ల్యాండయ్యారు అని తెలుస్తోంది. షెడ్యూల్ బిగిన్ కావడానికి పదిరోజులు ముందే ఆయన తన ఫ్యామిలీతో అక్కడఎంజాయ్ చేయబోతున్నట్టు సమాచారం.  



Updated Date - 2021-10-03T20:38:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!