మహేశ్‌28లో సుమంత్‌?

ABN , First Publish Date - 2021-05-15T04:14:01+05:30 IST

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కలయికలో ముచ్చటగా మూడో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. హీరోగా మహేశ్‌ 28వ చిత్రమిది. ‘అల... వైకుంఠపురములో’ చిత్రంలో ఓ పాత్రకు....

మహేశ్‌28లో సుమంత్‌?

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కలయికలో ముచ్చటగా మూడో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. హీరోగా మహేశ్‌ 28వ చిత్రమిది. ‘అల... వైకుంఠపురములో’ చిత్రంలో ఓ పాత్రకు అక్కినేని మనవడు సుశాంత్‌ను తీసుకున్నారు తివిక్రమ్‌. ఇప్పుడు మహేశ్‌28లో కీలక పాత్రకు మరో అక్కినేని మనవడు సుమంత్‌ను సంప్రదించారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మహేశ్‌, సుమంత్‌ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య 20 ఏళ్లుగా స్నేహం ఉంది. బహుశా... అంతా కుదిరితే ఈ సినిమాతో ఈ ఇద్దర్ని తెరపై చూడొచ్చు.

Updated Date - 2021-05-15T04:14:01+05:30 IST