`మహాసముద్రం` రిలీజ్ డేట్ ఫిక్స్!
ABN , First Publish Date - 2021-01-30T16:52:17+05:30 IST
శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా అజయ్ భూపతి డైరక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `మహా సముద్రం`.

శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా అజయ్ భూపతి డైరక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `మహా సముద్రం`. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదితీరావు హైదరి, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.