‘మహా సముద్రం’ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2021-09-20T22:56:20+05:30 IST

శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మహాసముద్రం’. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని

‘మహా సముద్రం’ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడంటే?

శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మహాసముద్రం’. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సెప్టెంబర్ 23న మహా సముద్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఇద్దరు హీరోలు రెడీగా ఉన్నట్టు పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated Date - 2021-09-20T22:56:20+05:30 IST