సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'మహాసముద్రం': ఆకట్టుకుంటున్న 'చెప్పకే..చెప్పకే' సాంగ్ మేకింగ్ వీడియో

ABN, First Publish Date - 2021-09-28T13:31:22+05:30

శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మహాసముద్రం’. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని అజయ్ భూపతి రూపొందిస్తుండగా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మహాసముద్రం’. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని అజయ్ భూపతి రూపొందిస్తుండగా, అదితిరావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమాపై బాగానే అంచనాలు పెంచాయి. 


ఈ క్రమంలో తాజాగా ఇందులోలోని ‘చెప్పకే.. చెప్పకే’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సముద్రంలో ఒడ్డున తెరకెక్కించిన ఈ సాంగ్ షూటింగ్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. జగపతిబాబు, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది. 'ఆర్.ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి నుంచి వస్తున్న చిత్రం 'మహా సముద్రం' ఆయనకి ఎలాంటి సక్సెస్‌ను ఇస్తుందో చూడాలి. 



Updated Date - 2021-09-28T13:31:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!