సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

భారీ చిత్రం ప్లాన్ చేస్తోన్న ‘మధుర వైన్స్’ చిత్ర నిర్మాత

ABN, First Publish Date - 2021-11-16T21:14:20+05:30

ఇటీవల వచ్చిన ‘మధుర వైన్స్’ చిత్రంతో నిర్మాతగా టాలీవుడ్‌కి పరిచయమైన ఆర్.కె. సినీ టాకీస్ అధినేత రాజేష్ కొండెపు.. తన తదుపరి చిత్రంగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు. నవంబర్ 16 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల వచ్చిన ‘మధుర వైన్స్’ చిత్రంతో నిర్మాతగా టాలీవుడ్‌కి పరిచయమైన ఆర్.కె. సినీ టాకీస్ అధినేత రాజేష్ కొండెపు.. తన తదుపరి చిత్రంగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు. నవంబర్ 16 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి బ్యానర్‌లో ‘మధుర వైన్స్’ చిత్ర దర్శకుడు జయకిశోర్ బండితో ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కించనున్న చిత్ర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నామని.. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, భారీ తారాగణంతో, అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని నిర్మాత రాజేష్ కొండెపు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మరిన్ని వివరాలను జనవరి నెలలో తెలియజేస్తామని ఆయన వెల్లడించారు.

Updated Date - 2021-11-16T21:14:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!