`మేడమ్ చీఫ్ మినిస్టర్` మేకింగ్ వీడియో!

ABN , First Publish Date - 2021-01-18T18:10:39+05:30 IST

వరుసగా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది రిచా చద్దా.

`మేడమ్ చీఫ్ మినిస్టర్` మేకింగ్ వీడియో!

వరుసగా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది రిచా చద్దా. ఇటీవల `షకీలా`గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రిచా చద్దా త్వరలోనే `మేడమ్‌ చీఫ్‌మినిస్టర్‌`గా అలరించబోతోంది. ఈ సినిమా కోసం రిచా ఎన్నో విషయాలు నేర్చుకుంది. బైక్ రైడింగ్ కూడా నేర్చుకుంది. 


రాజకీయ చదరంగంలో ఓ సాధారణ మహిళ ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగిందనేదానిని ఈ సినిమాలో చూపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ నెల 22న `మేడమ్‌ చీఫ్‌మినిస్టర్‌` సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Updated Date - 2021-01-18T18:10:39+05:30 IST