‘బిగ్‌బాస్’ ఫేమ్ మానస్ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో అనువాదం
ABN , First Publish Date - 2021-12-14T22:59:04+05:30 IST
చిత్ర విడుదల తర్వాత మానస్ నాగులపల్లి బిగ్‌బాస్‌కి సెలెక్ట్ కావడం, అందులో చక్కగా ఆడుతూ టాప్-5కి చేరడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనువాదం చేసేందుకు సన్నాహాలు

‘బిగ్‌బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన తెలుగు చిత్రం ‘క్షీర సాగర మథనం’ను.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అనువాదం చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లలో, అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై.. మంచి ఆదరణ చూరగొన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. మానస్‌తో పాటు నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి అనిల్ పంగులూరి దర్శకుడు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ మాట్లాడుతూ..‘‘ మా ‘క్షీర సాగర మథనం’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఆడియన్స్ ఇప్పటికీ విశేషంగా ఆదరిస్తున్నారు. చిత్ర విడుదల తర్వాత మానస్ నాగులపల్లి బిగ్‌బాస్‌కి సెలెక్ట్ కావడం, అందులో చక్కగా ఆడుతూ టాప్-5కి చేరడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనువాదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాము. అలాగే మా హీరో మానస్ బిగ్‌బాస్ విజేతగా నిలవాలని మనసారా కోరుకుంటున్నాము..’’ అని తెలిపారు.