సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

`లవ్ యూ రా` ఫస్ట్ లుక్ విడుదల

ABN, First Publish Date - 2021-02-11T00:55:49+05:30

సముద్రాల సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ ఆన్య ఆనంద్ సమర్పణలో ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో చిన్ను క్రిష్ , సాయి నాగ్ అట్లూరి , గీతిక రతన్ , మధు ప్రియ , హీరో హీరోయిన్లుగా సముద్రాల మంత్రయ్య బాబు 'లవ్ యు రా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆనాటి నుండి ఈనాటి వరకు వైవిధ్యమైన ప్రేమకథలు ఎన్నివచ్చినా.. వస్తున్నా వాటికి ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా సరికొత్త కథాంశంతో `లవ్ యూ రా` చిత్రం రాబోతుంది. సముద్రాల సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ ఆన్య ఆనంద్ సమర్పణలో ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో  చిన్ను క్రిష్  , సాయి నాగ్ అట్లూరి , గీతిక రతన్ , మధు ప్రియ , హీరో  హీరోయిన్లుగా  సముద్రాల మంత్రయ్య బాబు ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా `లవ్ యూ రా` మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ప్రేమకథకు కామెడీ థ్రిల్లర్‌ని జోడించి దర్శకుడు ప్రసాద్ ఏలూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈశ్వర్ పెరవళి సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

Updated Date - 2021-02-11T00:55:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!