50 మిలియన్ వ్యూస్ క్లబ్‌లో ‘సారంగ దరియా’
ABN , First Publish Date - 2021-03-15T01:38:21+05:30 IST
రీసెంట్‌గా విడుదలైన 'లవ్ స్టోరి' సినిమాలోని 'సారంగ దరియా' పాట సంచలనాలను క్రియేట్ చేస్తోంది. ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి.. టాలీవుడ్ హిస్టరీలో

రీసెంట్‌గా విడుదలైన 'లవ్ స్టోరి' సినిమాలోని 'సారంగ దరియా' పాట సంచలనాలను క్రియేట్ చేస్తోంది. ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి.. టాలీవుడ్ హిస్టరీలో ఘనమైన కీర్తిని గడించింది. దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'లవ్ స్టోరి'. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. దీనికి కారణం.. ఈ చిత్రంలోని ఒక్కో పాట ఆణిముత్యాల్లా తయారై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. రెండు వారాల కిందట రిలీజైన 'సారంగ దరియా' పాట ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది. ఫిబ్రవరి 28న సమంత చేతుల మీదుగా విడుదలైన ఈ సారంగ దరియా పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుంది. సాయిపల్లవి చేసిన పాట రౌడీ బేబీ ఒక్కటే 8 రోజుల్లో ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ కు రీచ్ అయి సారంగ దరియా కంటే ముందుంది. మిగతా సూపర్ హిట్ సాంగ్స్ బుట్ట బొమ్మ, రాములో రాములా పాటలు సారంగ దరియా స్పీడ్ కంటే వెనకబడ్డాయి. బుట్ట బొమ్మ పాటకు 50 మిలియన్ వ్యూస్ వచ్చేందుకు 18 రోజులు పట్టగా, రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది.
ఇక సారంగ దరియా పాట గురించి చెప్పుకుంటే.. ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా.. పవన్ సీహెచ్ సంగీతం ఈ తెలంగాణ జానపద గీతానికి అద్భుతంగా కుదిరింది. మంగ్లీ గొంతులో పలికిన మరో సూపర్ హిట్ సాంగ్ సారంగ దరియా. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ రేపు సినిమాలో ఆడియెన్స్‌తో స్టెప్పులు వేయించనుంది. ఇన్ని స్పెషాలిటీస్‌తో ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.

