ప్రేమ.. జీవితం.. పకోడి!
ABN , First Publish Date - 2021-03-08T10:01:02+05:30 IST
కార్తీక్ బిమల్ రెబ్బా, సంచిత జంటగా నటించిన చిత్రం ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’. ‘మధుర’ శ్రీధర్ సమర్పణలో జయంత్ గాలి స్వీయ...

కార్తీక్ బిమల్ రెబ్బా, సంచిత జంటగా నటించిన చిత్రం ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’. ‘మధుర’ శ్రీధర్ సమర్పణలో జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. ఈ నెల 12న విడుదల కానుంది. ‘‘బాలచందర్ తరహాలో మానవ సంబంధాలు, భావోద్వేగాలను జయంత్ చక్కగా చూపించారు. కేవలం మల్టీప్లెక్స్‌ల్లో, 70 స్ర్కీన్స్‌లో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని ‘మధుర’ శ్రీధర్ తెలిపారు. ‘‘తెలుగులో ఇలాంటి ప్రేమకథా చిత్రం చూడలేదని గర్వంగా చెప్పగలను’’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి అన్నారు.