అల... అమెరికాపురములో!
ABN , First Publish Date - 2021-06-17T10:26:56+05:30 IST
అమెరికాలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ‘అల... అమెరికాపురములో’ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వాషింగ్టన్...

అమెరికాలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ‘అల... అమెరికాపురములో’ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వాషింగ్టన్, చికాగో, న్యూజర్సీ, శాన్ జోస్, డల్లా్‌సలో మ్యూజిక్ కార్నివాల్‌కు సిద్ధమవుతున్నారు. తమన్ వెంట సంగీత బృందంలో శివమణి, నవీన్, ఆండ్రియా, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, హారికా నారాయణ్, శ్రుతీ రంజని, మనీషా తదితరులు పాల్గొంటారు. ‘‘ఓ ప్రముఖ హీరో ఈ ప్రదర్శనలకు అతిథిగా హాజరుకానున్నారు. అలాగే, పలువురు హీరోయిన్లు, దర్శకులు ఇందులో పాల్గొంటారు’’ అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోన్న హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ పేర్కొంది.