Liger: గ్లింప్స్‌కు టైమ్ ఫిక్స్
ABN , First Publish Date - 2021-12-29T17:57:06+05:30 IST
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లైగర్'. ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ అప్‌డేట్‌ను తాజాగా ఇచ్చింది చిత్రబృందం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లైగర్'. ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ అప్‌డేట్‌ను తాజాగా ఇచ్చింది చిత్రబృందం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, హిరూ యశ్ జోహార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీతో పాటు మిగతా సౌత్ భాషలలో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా గ్లింప్స్ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్ 31 వ తేదీన 10:03 గంటలకు గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ టైమ్ ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా, ఈ చిత్రంలో ప్రముఖ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 25న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.