సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

లాస్‌ఏంజిల్స్‌లో ‘లైగర్’ టీమ్

ABN, First Publish Date - 2021-11-28T17:09:33+05:30

రౌడీ‌హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలి కలయికలో రూపొందుతోన్న బాక్సింగ్ నేపథ్యంలోని యాక్షన్ మూవీ ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో.. భారీ అంచనాలతో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. కరణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో విడుదల చేస్తున్నారు. పూర్తి గా ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ సినిమా. ఇక ఇటీవల యూఎస్ షెడ్యూల్ ను ప్రారంభించిన ‘లైగర్’ టీమ్.. విజయ్ అండ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌడీ‌హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలి కలయికలో రూపొందుతోన్న బాక్సింగ్ నేపథ్యంలోని యాక్షన్ మూవీ ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో.. భారీ అంచనాలతో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. కరణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో విడుదల చేస్తున్నారు. పూర్తి గా ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ సినిమా. ఇక ఇటీవల యూఎస్ షెడ్యూల్ ను ప్రారంభించిన ‘లైగర్’ టీమ్.. విజయ్ అండ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. మైక్ టైసన్ ను తొలిసారిగా సెట్స్ లో కలుసుకొన్న విజయ్.. ఎంతో ఎగ్జైట్ అవుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. అదే సమయంలో మైక్ టైసన్ తో ‘లైగర్’ టీమ్ పూరీ, విజయ్, ఛార్మీ సైతం మైక్ టైసన్ తో ఫోటో దిగి షేర్ చేశారు. 


ఇక లేటెస్ట్ గా లాస్ ఏంజిల్స్ లో ‘లైగర్’ టీమ్ .. విజయ్, అన్యన్యా పాండే పూరీ, చార్మీ ఒక ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  త్వరలోనే మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరిపి యూఎస్ షెడ్యూల్ ను పూర్తి చేయబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాతో విజయ్ తొలిసారిగా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ హీరోగా ఎలివేట్ కాబోతున్నారు. పూరీ స్టైలాఫ్ కేరక్టరైజేషన్ తో లైగర్ గా అభిమానుల్ని మెప్పించబోతున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.  



Updated Date - 2021-11-28T17:09:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!