సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అమెరికాకు 'లైగర్'..

ABN, First Publish Date - 2021-11-09T16:07:29+05:30

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'లైగర్'. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ అమెరికాకు వెళ్ళబోతోంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో మైక్‌టైసన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'లైగర్'. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ అమెరికాకు వెళ్ళబోతోంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో మైక్‌టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి, బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఫైనల్ షెడ్యూల్ కోసం ఈ నెల 12వ తేదీన 'లైగర్' టీమ్ అమెరికా వెళుతోంది. హీరో విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

Updated Date - 2021-11-09T16:07:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!