ముంబైలో ‘లైగర్’.. ఛార్మీ ఆగలేకపోతోందట
ABN , First Publish Date - 2021-10-25T23:40:21+05:30 IST
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది ట్యాగ్‌లైన్. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఈ చిత్రంలో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది ట్యాగ్‌లైన్. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఈ చిత్రంలో విజయ్ యాక్షన్‌తో పాటు డ్యాన్సులతోనూ అందరినీ ఆశ్చర్యపరిచేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఓ మాస్ నంబర్‌కు సంబంధించిన షూటింగ్ మొదలైనట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ.. నిర్మాత ఛార్మీ ఓ పోస్ట్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ హ్యాండ్ మాత్రమే కనిపిస్తోంది.
‘ముంబైలో లైగర్ సాంగ్ షూటింగ్ మొదలైంది. విజయ్ దేవరకొండ ఇది వరకు ఎప్పుడూ చేయనట్టుగా డ్యాన్స్ చేసి అందరినీ అబ్బురపరుస్తారు. నన్ను నమ్మండి. మాస్ క్రేజీగా ఉండబోతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ చూశాక ఈ పోస్ట్ పెట్టకుండా ఉండలేకపోయాను..’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు ఛార్మీ. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో రూపొందుతోంది. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటిస్తోంది.