న్యూ ఇయర్ స్పెషల్: ‘లైగర్’ నుండి మల్టిపుల్ అప్‌డేట్స్
ABN , First Publish Date - 2021-12-29T02:47:20+05:30 IST
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్). బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో డైనమేట్ మైక్ టైసన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్). బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం కాబోతోన్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్‌ను త్వరలో ఇండియాలో షూట్ చేయబోతోన్నారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ చిత్రం నుండి వరుస అప్‌డేట్‌ను వదిలేందకు చిత్రయూనిట్ సిద్ధమైంది.
అందులో భాగంగా.. ఇది వరకు ప్రకటించినట్టుగానే ‘ఆగ్ లగా దేంగే..’ అంటూ లైగర్ ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్ 31న విడుదల చేయబోతోన్నారు. డిసెంబర్ 29న ఉదయం 10:03 గంటలకు ది బిగ్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేయబోతోన్నారు. డిసెంబర్ 30న రెండు స్పెషల్ ట్రీట్‌లు ఉండబోతోన్నాయని తెలుపుతూ.. సినిమాకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్‌ను ఉదయం 10:03 గంటలకు విడుదల చేస్తుండగా.. ఇన్ స్టా ఫిల్టర్‌ను సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతోన్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇకపై లైగర్ టీం నుంచి వచ్చే బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ కోసం రెడీగా ఉండండి అని చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రాన్ని 2022లో ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు.