Liger: బిటీఎస్ స్టిల్స్ రిలీజ్ .!

ABN , First Publish Date - 2021-12-30T18:31:46+05:30 IST

విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం అప్‌డేట్స్ ఇచ్చింది.

Liger: బిటీఎస్ స్టిల్స్ రిలీజ్ .!

విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం అప్‌డేట్స్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో వరుస అప్‌డేట్స్ ఇస్తున్నట్టు పూరి టీమ్ ఇటీవల ప్రకటించింది. అందులో భాగంగానే తాజాగా 'లైగర్' చిత్రానికి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ బిటీఎస్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ఇందులో పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ చర్చించుకుంటున్న ఫోటో ఒకటి అలాగే విజయ్ కెమెరాతో ఉన్న ఫోటో ఒకటి సొషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు (డిసెంబర్ 31) ఫస్ట్ గ్లింప్స్ రానుంది. కాగా, ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవల్‌లో ధర్మ ప్రొడక్షన్స్ - పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్నాయి. మైక్‌టసన్ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. 





Updated Date - 2021-12-30T18:31:46+05:30 IST