శంకర్‌పై లైకా మరో కేసు

ABN , First Publish Date - 2021-06-17T10:31:05+05:30 IST

తమిళ దర్శకుడు శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది...

శంకర్‌పై లైకా మరో కేసు

తమిళ దర్శకుడు శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసేదాకా శంకర్‌ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా నిలువరించాలంటూ లైకా ప్రొడక్షన్స్‌ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్‌ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. దీంతో శంకర్‌ చెన్నై హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోనే విచారణ కొనసాగేలా చూడాలని న్యాయస్థానాన్ని శంకర్‌ కోరారు.


Updated Date - 2021-06-17T10:31:05+05:30 IST