మళ్లీ ‘లెజెండ్ శరవణ‌’‌ చిత్రం సెట్‌ పైకి..

ABN , First Publish Date - 2021-03-03T21:59:50+05:30 IST

చెన్నైలోని ప్రధాన వస్త్రదుకాణాల్లో శరవణా స్టోర్స్‌ ఒకటి. ఈ వ్యాపార దుకాణం యజమాని ‘లెజెండ్‌’ శరవణన్‌ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి

మళ్లీ ‘లెజెండ్ శరవణ‌’‌ చిత్రం సెట్‌ పైకి..

కోలీవుడ్‌: చెన్నైలోని ప్రధాన వస్త్రదుకాణాల్లో శరవణా స్టోర్స్‌ ఒకటి. ఈ వ్యాపార దుకాణం యజమాని హీరోగా ‘లెజెండ్ శరవణ‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేడీ - జెర్రీ అనే ఇద్దరు దర్శకులు పనిచేస్తున్నారు. గత యేడాది 10 కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్‌ ఒకటి నిర్మించి అందులో ఓ పాటను చిత్రీకరించారు. కానీ, కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఆగిపోయింది. ఈ క్రమంలో ఇపుడు మళ్ళీ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. నగరంలోని ఒక ప్రైవేటు కాలేజీలో విలన్‌గా నటించే బెసెంట్‌నగర్‌ రవితో.. ‘లెజెండ్‌’ శరవణన్‌ తలపడే పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వైరముత్తు గేయరచన చేయగా, హారీస్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2021-03-03T21:59:50+05:30 IST