అమెరికాలో మహేశ్‌కు సర్జరీ
ABN , First Publish Date - 2021-12-14T22:59:20+05:30 IST
మహేశ్‌బాబుకు ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. గత కొంతకాలంగా ఆయన మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రమవడంతో శస్త్ర చికిత్స చేయాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో పది రోజుల మహేశ్ కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లారు.

మహేశ్‌బాబుకు ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. గత కొంతకాలంగా ఆయన మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రమవడంతో శస్త్ర చికిత్స చేయాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో పది రోజుల మహేశ్ కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లారు. అక్కడే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు మహేశ్. ప్రస్తుతం ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మహేశ్ షూటింగ్‌లో పాల్టొంటారిన సన్నిహితులు తెలిపారు. ఏప్రిల్ 1, 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నారు.