కొవిడ్‌తో ప్రముఖ మలయాళ పాటల రచయిత పూవచల్‌ ఖాదర్‌ మృతి

ABN , First Publish Date - 2021-06-23T06:06:35+05:30 IST

ప్రముఖ మలయాళ పాటల రచయిత పూవచల్‌ ఖాదర్‌ మంగళవారం మృతి చెందారు. ఆయన వయసు 72 సంవత్సరాలు...

కొవిడ్‌తో ప్రముఖ మలయాళ పాటల రచయిత పూవచల్‌ ఖాదర్‌ మృతి

ప్రముఖ మలయాళ పాటల రచయిత పూవచల్‌ ఖాదర్‌ మంగళవారం మృతి చెందారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం కొవిడ్‌-19 బారిన పడటంతో తిరువనంతపురం మెడికల్‌ కాలేజీలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇంతలో గుండెపోటు రావడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. మలయాళంలో సుమారు 350కు పైగా చిత్రాల్లో, వెయ్యికి పైగా పాటలను ఖాదర్‌ రాశారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన పాటలు రచించారు. విద్యార్థి దశ నుంచే ఖాదర్‌కు కవిత్వం రాసే అలవాటు ఉంది. తర్వాత రేడియోకు నాటికలు, పాటలు రాయడం ప్రారంభించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. మలయాళ చిత్ర పరిశ్రమలో 70, 80లలో ఆయన బిజీ పాటల రచయిత. ఖాదర్‌ మృతి పట్ల పలువురు మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-06-23T06:06:35+05:30 IST