సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మెరుగుపడుతోన్న హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం

ABN, First Publish Date - 2021-09-13T22:47:04+05:30

హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోన్నట్లుగా అపోలో డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయులోనే చికిత్స కొనసాగుతోందని, చికిత్సకు తేజ్ చక్కగానే స్పందిస్తున్నాడని వారు తెలియజేశారు. ఈ రోజు సాయంత్రానికి ఆయనకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోన్నట్లుగా అపోలో డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయులోనే చికిత్స కొనసాగుతోందని, చికిత్సకు తేజ్ చక్కగానే స్పందిస్తున్నాడని వారు తెలియజేశారు. ఈ రోజు సాయంత్రానికి ఆయనకు వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్య బృందం సాయిధరమ్ తేజ్‌ను క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తున్నారు. అపోలో హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తేజ్ దగ్గరకు డాక్టర్లు ఎవ్వరినీ అనుమతించడం లేదని, ఫ్యామిలీ సభ్యులకు మాత్రం వీడియోలో చూపిస్తున్నారని తెలుస్తోంది. కాగా, సాయితేజ్ త్వరగా కోలుకోవాలని మెగా కుటుంబంతో పాటు, మెగాభిమానులు, శ్రేయోభిలాషులందరూ ప్రార్థనలు చేస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-09-13T22:47:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!