`భీష్మ`ను గుర్తు చేసుకున్న రష్మిక!
ABN , First Publish Date - 2021-02-21T16:43:48+05:30 IST
rashmika remembers bheeshma

గతేడాది సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న కన్నడ భామ రష్మికా మందన్న ఆ వెంటనే `భీష్మ`తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. నితిన్‌తో కలిసి రష్మిక నటించిన `భీష్మ` గతేడాది ఫిబ్రవరిలో విడుదలై ఘనవిజయం సాధించింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వెంకీ కుడుముల రూపొందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై నేటితో (ఆదివారం) ఏడాది పూర్తయింది.
ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా ద్వారా ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుంది. ``భీష్మ` విడుదలై అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. నాకేనా అందరికీ అలాగే జరుగుతోందా? వెంకీ.. నీతోనూ, ఫిబ్రవరితోనూ మంచి అనుబంధం ఉంది. ఫిబ్రవరిని నాకు చాలా స్పెషల్‌గా మార్చినందుకు నితిన్‌కు, వెంకీకి ధన్యవాదల`ని రష్మిక పేర్కొంది. రష్మిక తొలి తెలుగు సినిమా `ఛలో` కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదలైంది. ఈ సినిమాకు కూడా వెంకీ కుడుములే దర్శకుడు.