సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

#Bheemla Nayak : లాలా.. భీమ్లా డీజే వెర్షన్ వచ్చేస్తోంది

ABN, First Publish Date - 2021-12-29T17:01:15+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో స్వల్ప మార్పులు చేసి తనదైన శైలిలో ట్రీట్ మెంట్ అందించారు త్రివిక్రమ్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో స్వల్ప మార్పులు చేసి తనదైన శైలిలో ట్రీట్ మెంట్ అందించారు త్రివిక్రమ్.  వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరి 25కు షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది వరకు విడుదలైన ఈ సినిమా టీజర్స్, సింగిల్స్ కు అభిమానులనుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఈ క్రమంలో ఈ సినిమాలోని మరో సింగిల్ ను కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. అంత కన్నా ముందే ‘భీమ్లా నాయక్’ చిత్రం నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ను సిద్ధం చేశారు మేకర్స్. 


‘భీమ్లానాయక్’ చిత్రం నుంచి ఇప్పటి వరకూ విడుదలైన సింగిల్స్ అన్నింటిలోనూ అభిమానులకు బాగా ఊపునిచ్చిన పాట .. లాలా భీమ్లా. తమన్ అద్భుతమైన సంగీతంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటకు డీజే వెర్షన్ ను వదులుతన్నారు మేకర్స్. దానికి డిసెంబర్ 31న ముహూర్తం నిర్ణయించారు. సాయంత్రం 7 గంటల 02 నిమిషాలకు విడుదల కానుంది ఈ పాట. నిజానికి లాలా భీమ్లా ఒరిజినల్ సాంగే.. ఓ రేంజ్ లో మోతెక్కించింది. దీనికి డీజే మిక్సింగ్ కూడా అయితే.. ఆ పాట ఇంకెంత రేంజ్ లో ఉంటుందో.. ఊహించుకుంటేనే అభిమానుల్లో ఆత్రుత ఆగడం లేదు. మరి లాలా భీమ్లా డీజె వెర్షన్ వినాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.  



Updated Date - 2021-12-29T17:01:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!