నాగ్ తినిపించిన ‘లడ్డుండ’
ABN, First Publish Date - 2021-11-09T05:30:00+05:30
కథానాయకులు అప్పుడప్పుడు గొంతు సవరించుకుని పాటలు పాడడం అలవాటే. ఇది వరకు నాగార్జున కూడా ‘సీతారామరాజు’లో ఓ పాట పాడారు. మళ్లీ ఇంతకాలానికి నాగ్ నోటి నుంచి పాట...
కథానాయకులు అప్పుడప్పుడు గొంతు సవరించుకుని పాటలు పాడడం అలవాటే. ఇది వరకు నాగార్జున కూడా ‘సీతారామరాజు’లో ఓ పాట పాడారు. మళ్లీ ఇంతకాలానికి నాగ్ నోటి నుంచి పాట వినిపించింది. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. నాగచైతన్య, కృతిశెట్టి, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని ‘లడ్డుండ’ పాటని మంగళవారం విడుదల చేశారు. అనూప్ స్వరపరిచిన ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్ రాశారు. నాగార్జునతో పాటు ధనుంజయ్, మోహన భోజరాజు, నూతనమోహన్, హరిప్రియ ఈ పాటని ఆలపించారు. మంగళవారం నుంచి మైసూర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైందని, నాగార్జున, ఇతర ప్రధాన పాత్రధారులపై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం తెలిపింది. చలపతిరావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని జీ.స్డూడియోస్, అన్నపూర్ణ స్డూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.