థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వండి - ఖుష్బూ
ABN , First Publish Date - 2021-01-03T05:15:45+05:30 IST
ప్రస్తుతం థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. కానీ, పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం లేదు. ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా 50 శాతం టికెట్లు మాత్రమే అమ్ముతున్నారు. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి...

ప్రస్తుతం థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. కానీ, పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం లేదు. ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా 50 శాతం టికెట్లు మాత్రమే అమ్ముతున్నారు. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఓ విజ్ఞప్తి చేశారు. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వమని ఆమె కోరారు. ‘‘వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇస్తే చిత్ర పరిశ్రమకు పెద్ద మేలు జరుగుతుంది. ప్రేక్షకుల ఆరోగ్య భద్రతలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలన్నీ తీసుకుంటామని ప్రామిస్ చేస్తున్నా’’ అని ఓ తమిళ సినిమా కార్యక్రమంలో ఖుష్బూ వ్యాఖ్యానించారు.