చూడాలి మరి : కృతిశెట్టి
ABN , First Publish Date - 2021-05-04T14:01:07+05:30 IST
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యంగ్ హీరోయిన్ కృతిశెట్టి తన గొంతు వినిపించాలనుకుంటోందట. అంటే తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని తాపత్రయపడుతోంది. ఇటీవల ఒక అభిమాని.. 'మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది. ఫ్యూచర్ సినిమాల్లో ఓన్ డబ్బింగ్ చెప్తారా..!' అని అడిగాడు.
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యంగ్ హీరోయిన్ కృతిశెట్టి తన గొంతు వినిపించాలనుకుంటోందట. అంటే తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని తాపత్రయపడుతోంది. ఇటీవల ఒక అభిమాని.. 'మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది. ఫ్యూచర్ సినిమాల్లో ఓన్ డబ్బింగ్ చెప్తారా..!' అని అడిగాడు. ఆ మాటకి కృతిశెట్టి.. 'నాకు కూడా ఓన్ డబ్బింగ్ చెప్పాలనే ఉంది. చూడాలి మరి' అంటూ క్యూట్‌గా సమాధానమిచ్చింది. 'ఉప్పెన' సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారిన కృతిశెట్టి ఈ సినిమా రిలీజ్ కాకుండానే వరసగా సినిమాలకు సైన్ చేసేసింది. నేచురల్ స్టార్ నానితో పీరియడిక్ మూవీగా తెరకెక్కుతున్న 'శ్యామ్ సింగరాయ్', సుధీర్ బాబుకు జంటగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలను ఒప్పుకుంది. ఇక 'ఉప్పెన' రిలీజయ్యాక తెలుగు, తమిళ భాషల్లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా కోలీవుడ్‌లో కూడా కృతిశెట్టి ఎంటరవబోతోంది. అయితే తాజాగా కృతిశెట్టి చెప్పిన మాటలను బట్టి చూస్తే ప్రస్తుతం కమిటయిన సినిమాలకే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టేలా అనిపిస్తోంది.