సిద్ధమైన ‘సుందరాంగుడు’

ABN , First Publish Date - 2021-12-30T22:44:24+05:30 IST

కృష్ణసాయి హీరోగా.. మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ హీరోయిన్లుగా చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ - ఎమ్.ఎస్.కె. ప్రమీదశ్రీ ఫిలిమ్స్ పతాకాలపై ఎమ్.ఎస్.రాజు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

సిద్ధమైన ‘సుందరాంగుడు’

కృష్ణసాయి హీరోగా.. మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ హీరోయిన్లుగా చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ - ఎమ్.ఎస్.కె. ప్రమీదశ్రీ ఫిలిమ్స్ పతాకాలపై ఎమ్.ఎస్.రాజు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సుందరాంగుడు’. వినయ్ బాబు దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. జనవరి మూడోవారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా హీరో కృష్ణ సాయి టైటిల్ రోల్‌లో చాలా అద్భుతంగా నటించాడు. ఈ సినిమా విడుదల తర్వాత అతను బిజీ హీరో అవుతాడు. చిత్రం విషయానికి వస్తే.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. రామోజీ ఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జనవరి మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు.

Updated Date - 2021-12-30T22:44:24+05:30 IST