సెప్టెంబ‌ర్ 3న ఈ సినిమా కంచెకు చేర‌బోతోంది: క్రిష్

ABN , First Publish Date - 2021-08-29T22:06:53+05:30 IST

కంచె సినిమా చేస్తున్న స‌మ‌యంలో ఓరోజు అవ‌స‌రాల‌గారు జార్జియాలో నాతో మాట్లాడుతూ ప్ర‌తి మ‌నిషిలోనూ ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. వాటి వ‌ల్ల వాళ్లే వారి జీవితాన్ని న‌ర‌క‌ప్రాయంగా మార్చుకుంటారు. ఆ పాయింట్‌ను

సెప్టెంబ‌ర్ 3న ఈ సినిమా కంచెకు చేర‌బోతోంది: క్రిష్

ద‌ర్శ‌కుడిగానూ, నటుడిగానూ వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తున్న నటుడు అవ‌స‌రాల శ్రీనివాస్. ఆయన హీరోగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం  ‘101 జిల్లాల అంద‌గాడు’. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండగా.. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌కాబోతోన్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.


ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి మాట్లాడుతూ.. ‘‘కంచె సినిమా చేస్తున్న స‌మ‌యంలో ఓరోజు అవ‌స‌రాల‌గారు జార్జియాలో నాతో మాట్లాడుతూ ప్ర‌తి మ‌నిషిలోనూ ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. వాటి వ‌ల్ల వాళ్లే వారి జీవితాన్ని న‌ర‌క‌ప్రాయంగా మార్చుకుంటారు. ఆ పాయింట్‌ను హిలేరియ‌స్‌గా చూపిస్తానంటూ ఇర‌వై నిమిషాల క‌థ‌ను చూపించారు. బాగా న‌వ్వుకున్నాం. నాకు, రాజీవ్‌గారికి క‌థ బాగా న‌చ్చింది. రెండు సంవత్స‌రాల త‌ర్వాత అంటే 2017లో డైరెక్ట‌ర్ సాగ‌ర్‌గారిని క‌లిశాను. ఆయ‌న విలేజ్‌లో జ‌రిగే ఓ థ్రిల్ల‌ర్ క‌థ‌ను చెప్పారు. అవ‌స‌రాల‌తో ఆ క‌థ‌ను చేద్దామ‌ని నేను, రాజీవ్‌గారు అనుకుంటున్న స‌మ‌యంలో నేనే రెండేళ్ల ముందు మీరొక క‌థ చెప్పారు క‌దా అని గుర్తు చేశాను. దానికి 101 జిల్లాల అంద‌గాడు అనే పేరు పెట్టామండి అని క‌థ చెప్పాడు. ఇది చాలా మంది క‌థ‌, చాలా మంచి క‌థ దీన్ని సినిమా తీద్దామ‌ని అన్నాను. ‘కంచె’ సినిమా స‌మ‌యంలో ప్రారంభ‌మైన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 3న కంచెకు చేర‌బోతుంది. అవ‌స‌రాల శ్రీనివాస్ పర్‌ఫెక్ష‌నిస్ట్‌. సినిమా కోసం ఐదారు నెల‌ల పాటు గుండుతోనే ఉన్నారు. చాలా ప్యాష‌న్‌తో చేసుకున్న క‌థ‌. ఆయ‌న ఎంత ప్యాష‌న్‌గా రాసుకున్నారో అంతే ప్యాష‌న్ ఉన్న టీమ్ తయారైంది. ఈ చిత్రంతో అవసరాల శ్రీనివాస్.. నవరసాల శ్రీనివాస్‌గా పేరు తెచ్చుకుంటాడు. సెప్టెంబ‌ర్ 3 కోసం ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.

Updated Date - 2021-08-29T22:06:53+05:30 IST