‘పుష్ప 2’ తర్వాత మంచి కథతో వస్తా: కొరటాల శివ

ABN , First Publish Date - 2021-12-14T01:08:23+05:30 IST

డి గ్లామర్ రోల్ చేసినా కూడా రష్మిక చాలా అందంగా ఉన్నారు. ఇక ఒక సినిమా కోసం ఇంతగా ప్రాణం పెట్టి పని చేసే నటుడు ఇండియాలో మరెవరూ ఉండరు. మీ డెడికేషన్‌కు నిజంగా సలాం బన్ని. మీకు సినిమా తప్ప మరో ధ్యాస ఉండదని తెలుసు. మీరు ఎంత గొప్ప నటుడు అనేది పుష్ప విడుదల తర్వాత ఇంకా అర్థమవుతుంది. పుష్ప 2

‘పుష్ప 2’ తర్వాత మంచి కథతో వస్తా: కొరటాల శివ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో పుష్ప ప్రీ రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి, సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ అతిథులుగా హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముంబైలో జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దర్శకుడు సుకుమార్ ఈ వేడుకకు హాజరు కాలేదు. ఆయన బాధ్యతలు కూడా కొరటాల శివే నిర్వర్తించారు. 


ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఒక అందమైన ప్రపంచం.. అద్భుతమైన యూనివర్స్ క్రియేట్ చేయాలి అంటే కేవలం సుకుమార్‌కు మాత్రమే సాధ్యమవుతుంది. తొలి సినిమా నుంచి సుకుమార్ డెడికేషన్ చూస్తున్నాను. ఈరోజు ఆయన తరపున నేను మాట్లాడడానికి వచ్చాను. ఈ మాటలు నావి కావు సుకుమార్‌వి. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసిన టెక్నికల్ టీమ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాను. డి గ్లామర్ రోల్ చేసినా కూడా రష్మిక చాలా అందంగా ఉన్నారు. ఇక ఒక సినిమా కోసం ఇంతగా ప్రాణం పెట్టి పని చేసే నటుడు ఇండియాలో మరెవరూ ఉండరు. మీ డెడికేషన్‌కు నిజంగా సలాం బన్ని. మీకు సినిమా తప్ప మరో ధ్యాస ఉండదని తెలుసు. మీరు ఎంత గొప్ప నటుడు అనేది పుష్ప విడుదల తర్వాత ఇంకా అర్థమవుతుంది. పుష్ప 2 తర్వాత ఇంతకంటే అద్భుతమైన కథతో మీ దగ్గరకు వస్తాను. ఖచ్చితంగా డిసెంబర్ 17 ఫస్ట్ డే మార్నింగ్ షో నేను అక్కడ ఉంటాను. ఆల్ ద బెస్ట్ బన్ని, సుక్కు బాయ్.. ఈ ఒక్క మాట నాది..’’ అని తెలిపారు.

Updated Date - 2021-12-14T01:08:23+05:30 IST