రెండు బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో కిరణ్ అబ్బవరం చిత్రం.. కొరటాల క్లాప్

ABN , First Publish Date - 2021-11-29T22:33:37+05:30 IST

హీరో కిరణ్ అబ్బవరం హీరోగా మరో చిత్రం మొదలైంది. ఇటీవల వరుస చిత్రాలతో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద యంగ్ హీరోగా మారుతున్న కిరణ అబ్బవరం హీరోగా ప్రముఖ నిర్మాత సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌ - క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్..

రెండు బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో కిరణ్ అబ్బవరం చిత్రం.. కొరటాల క్లాప్

హీరో కిరణ్ అబ్బవరం హీరోగా మరో చిత్రం మొదలైంది. ఇటీవల వరుస చిత్రాలతో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద యంగ్ హీరోగా మారుతున్న కిరణ అబ్బవరం హీరోగా ప్రముఖ నిర్మాత సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌ - క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఇంతకుముందు ఈ రెండు బ్యానర్లు సంయుక్తంగా ‘మత్తు వదలరా’ అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ రెండు బ్యానర్ల సంయుక్తంగా నిర్మించబోతున్న తాజా చిత్ర పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. సంచలన దర్శకుడు కొరటాల శివ క్లాప్‌తో మొదలైన ఈ చిత్రం.. ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేనిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమేష్ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కనుంది. 


పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులు. కాగా, ముహూర్తపు సన్నివేశానికి యువ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబి) కెమెరా స్విచ్ఛాన్ చేయగా, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ముహుర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, చిరంజీవి (చెర్రీ)లు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా.. తొలి చిత్రమే ఇంత పెద్ద బ్యానర్స్‌లో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, పక్కా ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా దర్శకుడు రమేష్ కాదూరి తెలిపారు.Updated Date - 2021-11-29T22:33:37+05:30 IST