‘జైభీమ్’ సినిమాని ప్రశంసించిన కోనవెంకట్

ABN , First Publish Date - 2021-11-16T21:55:49+05:30 IST

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. ఘన విజయం సాధించడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న హార్ట్ టచింగ్ మూవీ ‘జై భీమ్’. సూర్య సొంత నిర్మాణంలో.. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చంద్రు అనే ఓ లాయర్ జీవిత చరిత్ర. ఆయన వాదించి విజయం సాధించిన ఓ అరుదైన కేసు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా ప్రశంసలు దక్కించుకుంది.

‘జైభీమ్’ సినిమాని ప్రశంసించిన కోనవెంకట్

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. ఘన విజయం సాధించడమే కాకుండా..  విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న హార్ట్ టచింగ్ మూవీ ‘జై భీమ్’. సూర్య సొంత నిర్మాణంలో.. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చంద్రు అనే ఓ లాయర్ జీవిత చరిత్ర. ఆయన వాదించి విజయం సాధించిన ఓ అరుదైన కేసు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా అందులో భార్యా భర్తలుగా నటించిన లిజో మోల్ జోస్ అనే అమ్మాయి, మణికంఠన్ అనే పాత్రధారులు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాను ఇటీవల వీక్షించిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, రచయిత కోన వెంకట్ ప్రశంసలు కురిపించారు. 


‘ఇలాంటి కళాఖండాల్ని ప్రశంసించడంలో ఎప్పుడూ లేట్ చేయకూడదు. ‘జై భీమ్’ అలాంటి ఓ హృద్యమైన సినిమా. ఈ తరహా కథాంశాన్ని ఎంపికచేసుకున్నందుకు నేను సూర్యకి ప్రణమిల్లుతున్నాను. ఇలాంటి కళాఖండాన్ని నిర్మించినందుకు జ్యోతికకి, దర్శకత్వం వహించినందుకు జ్ఞానవేల్ కు అభినందనలు తెలుపుతున్నాను’... అంటూ జైభీమ్ చిత్రంపై ప్రశంసల జల్లులు కురిపించారు కోనవెంకట్.   Updated Date - 2021-11-16T21:55:49+05:30 IST