‘లవ్ స్టోరి’ని ‘ప్రేమనగర్’తో పోల్చిన కింగ్ నాగ్

ABN , First Publish Date - 2021-09-13T23:57:05+05:30 IST

సంతోషం, బాధ, ప్రేమ, ఉద్యోగం, కుటుంబం.. ఇలా జీవితంలోని రంగుల చిత్రాన్ని చూపిస్తూ సాగింది చైతూ, సాయిపల్లవిల ‘లవ్ స్టోరి’ చిత్ర ట్రైలర్. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువసామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా

‘లవ్ స్టోరి’ని ‘ప్రేమనగర్’తో పోల్చిన కింగ్ నాగ్

సంతోషం, బాధ, ప్రేమ, ఉద్యోగం, కుటుంబం.. ఇలా జీవితంలోని రంగుల చిత్రాన్ని చూపిస్తూ సాగింది చైతూ, సాయిపల్లవిల ‘లవ్ స్టోరి’ చిత్ర ట్రైలర్. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువసామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈనెల 24న థియేటర్‌లలో విడుదలకానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన కింగ్ నాగార్జున.. ‘లవ్ స్టోరి’ చిత్రంలోని ఓ పోస్టర్‌ని.. తన తండ్రి, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమనగర్’ చిత్ర పోస్టర్‌తో పోల్చుతూ.. ట్విట్టర్ వేదికగా చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. 24, సెప్టెంబర్ 1971లో ‘ప్రేమనగర్’ చిత్రం విడుదలైతే.. 24, సెప్టెంబర్ 2021న చైతూ ‘లవ్ స్టోరి’ విడుదల కాబోతోంది అని తెలుపుతూ..  ‘‘ ‘లవ్ స్టోరి’ చూడడానికి చాలా బాగుందిరా ఛై.. ఆల్ ద బెస్ట్’’ అని కింగ్ నాగార్జున తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 





Updated Date - 2021-09-13T23:57:05+05:30 IST