‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసిన కింగ్

ABN , First Publish Date - 2021-10-23T23:40:08+05:30 IST

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో.. నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసువ‌ర్మలు సంయుక్తంగా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసిన కింగ్

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో.. నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసువ‌ర్మలు సంయుక్తంగా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌లై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్ప‌టికే 40 కోట్లకి పైగా గ్రాస్ వ‌సూలు చేసి అఖిల్ అక్కినేని కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిల‌వ‌టం విశేషం. ఈ చిత్రం ఘ‌న‌ విజ‌యం సాధించిన సంద‌ర్బంగా కింగ్ అక్కినేని నాగార్జున చిత్ర టీమ్‌ని అభినందిస్తూ.. ఆయ‌నే హోస్ట్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్‌తో పాటు ద‌ర్శ‌కులు సుకుమార్‌, వంశి పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్‌, మారుతి, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, సుబ్బు, వెంకి అట్లూరి, డాలి, ప్ర‌తాప్‌, కౌషిక్ మొదలగువారు హాజ‌ర‌య్యారు. ఈ సినిమా ఇంకా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుతూ హాజరైన వారంతా చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.





Updated Date - 2021-10-23T23:40:08+05:30 IST