#Rc15 : బల్క్ డేట్స్ ఇచ్చిన కియారా అద్వానీ
ABN , First Publish Date - 2021-10-04T16:00:17+05:30 IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో తెలుగు,తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ .. ఈ నెల రెండో వారంలోనే స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ భారీ చిత్రం కోసం పూణేలో ఓ ప్రత్యేకమైన సెట్ నిర్మిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో తెలుగు,తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ .. ఈ నెల రెండో వారంలోనే స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ భారీ చిత్రం కోసం పూణేలో ఓ ప్రత్యేకమైన సెట్ నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ , మలయాళ నటుడు జయరామ్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమా కోసం అందాల కథానాయిక కియారా అద్వానీ.. బల్క్ డేట్స్ కేటాయించిందట. ఈ నెల మూడోవారంలో కియారా షూటింగ్ లో జాయిన్ అవుతుందని సమాచారం. తను ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా నెర్వస్ గానూ, అదే సమయంలో చాలా ఆనందంగా ఫీలవుతున్నానని, సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొందామా అనే ఆసక్తితో ఉన్నానని, నాకు లభించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెబుతోంది కియారా. ‘వినయ విధేయరామ’ తర్వాత మరోసారి ఆన్ స్ర్కీన్ రొమాన్స్ కు సిద్ధపడుతోన్న చెర్రీ, కియారా ఈ మూవీతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో చూడాలి.